Friday, July 6, 2012

తొలి ఏకాదశి - పండుగ విశిష్టత - కథ

ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు.

శ్రీ మహావిష్ణువు క్షీరసాగరం లో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. 

అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు.

ఇది  హైందవ సంస్కృతి లో విశేష స్థానముంది.

శ్రీ మహావిష్ణువు స్వామివారు పాతాళ లోకం లో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. 

ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరిస్తారు .

కథ - ఏకాదశి   విశిష్టత

కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించడంతో శ్రీ మహా విష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి.. 

అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.

శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి..రాక్షసుణ్ని అంతం చేసిందట. 

ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా

తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట.. 

అప్పటి నుంచి ఆమె 'ఏకాదశి' తిథిగా వ్యవహారంలోకి వచ్చింది

నాటి నుంచి సాధువులు, భక్తజనులు 'ఏకాదశి' వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.