Friday, September 25, 2020

Kowrava Samrajyam - Movie Producer Maddali Kesava Rao – His Personal Experience with S. P. Balasubrahmanyam

Jai Vasavi Mata Jai

 

Maddali Kesava Rao is my father’s younger brother who is movie producer of Kowrava Samrajyam under banner of Sri Sravani Art Movies.

 

He shared his personal experience with S. P. Balasubrahmanyam while recording songs for his Movie at Vahini Studios Madras in the year 1989 to 1990.

 

It is as follows.

శ్రీ S P బాల సుబ్రమణ్యం గారు శివైక్యం చెందిన సందర్భంగా వారిపదాలకు నమస్కరిస్తూ వారితో నాకు వున్న మరపురాని అనుబంధం మీ అందరితో పంచుకోవాలని మీతో షేర్ చేస్తున్నాను.

1989 తో 1990 లో నేను శ్రీ శ్రావణి ఆర్ట్ మూవీస్ అనే బ్యానర్ పై శ్రీ అయినబతిన ప్రభాకరరావు గారి దర్శకత్వంలో 'కౌరవ సామ్రాజ్యం' అనే మూవీని నిర్మించాను.

 ఆ సందర్భంగా SP బాల సుబ్రహ్మణ్యం గారితో నాకు సినీ ప్రపంచంలో నేను వినని ఒక సంఘటన వారితో జరిగింది. 

నా మూవీలో ఐదు పాటలు శ్రీ J V రాఘవులు గారు సంగీతం సమర్పించి అందులో పాటలను సిరివెన్నెల సీతా రామశాస్ట్రీగారు ,శ్రీ జాలాది గారు , శ్రీరామమూర్తి గారు మరియు శ్రీ బొగ్గవరపు రాధాకృష్ణమూర్తిగారు పాటలను రచించగా అందులో రెండు పాటలను 'వందేమాతరం శ్రీనివాస్ గారు మూడు పాటలను శ్రీ S P బాల సుబ్రమణ్యం గారు స్వరపరిచారు. 

ఆ రోజు శ్రీ రాజీవ్ గాంధీ గారు బొంబ్బలాస్ట్ ఐనారోజు. 

ఆదే రోజు నాకు వాహిని స్టూడియోలో నాకూ ముందుగానే మ్యూజిక్ థియటర్ నాకు allotment జరిగింది. 

ఆ పరిస్థితి ని ఊహించుకోండి . 

ఎక్కడికక్కడ బస్సెస్ బంద్.

 ట్రైన్స్ బంద్ ట్రాన్స్పోర్ట్ బంద్ . 

Outdoor యూనిట్ సభ్యులు అందరూ దారి మద్యలో వున్నారు నేను పాటలు పాడించుకొని ఆ casette ని షూటింగ్ స్పాట్ కు తీసుకుని వెళ్ళాలి అందులోను నామూవీ సింగిల్ షెడ్యూల్ 30 డేస్ రెగులర్ షూటింగ్ .

ఒకరోజు మిస్ అయినా నా budget సరిపోదు అప్పటికే చాలా ఖర్చు అయిపోయింది. ఆ టైంలో శ్రీ బాలు గారు హైదరాబాద్ లో ఉన్నారు. 

నా పరిస్ధితి అంతా రాఘవులు గారు బాలు గారికి వివరించారు. 

ఒక క్రొత్త నిర్మాత ఈ రోజు కాల్ షీట్ ఉపయోగించుకోకపోతే అతను చాలా దెబ్బతింటాడు అని బాలు గారికి ఫోన్లో చెప్పటం జరిగింది. 

ఆ టైంలో నేను తప్పకుండా స్టూడియోకు వస్తాను కాల్షీట్ నా వలన కాన్సిల్ చేసుకోవద్దు అని రాఘవులు గారితో అన్నారు. 

కాని ఆయన కూడా బాలు గారు వస్తారని నమ్మకం లేదు కారణం హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో రావాలి అందులోనూ నేను చాలా చిన్న నిర్మాతను.  

కానీ ఎలా మన తల రాత ఎలా వుంటే అలా జరుగుతుంది అనుకుని వందేమాతరం శ్రీనివాసరావు గారితో రెండు పాటలను పాడిన్చుకుని బాలు గారి కోసము చకోర పక్షి ఎదురు చేస్తున్నట్లుగా స్టూడియోలో వున్నాం.

 ఆఫ్టర్ త్రీ hours S P బాలు గారు కమింగ్. 

వెంటనే థియటర్ లోకి వెళ్లి ఒక పాట రికార్డింగ్ చేసారు. 

అనుకోకుండా రెండవ పాటకు నా దురదృష్టం వెంటాడింది. 

అప్పుడు అమ్మ రాజీనామా సినిమా నిర్మాతలు(పెద్ద నిర్మాతలు)బాలు గారి కొసం వచ్చి వారి సినిమా పాట 
కొసం బాలు గారిని వత్తిడి చేసారు. 

అప్పుడు థియేటర్ కాల్ షీట్ నా టైం నడుస్తుంది. 

అప్పుడు బాలుగారు వారికోసం నన్ను రిక్వెస్ట్ చేసుకుని వారి పాటను కంప్లీట్ చేశారు. 

ఇక నాకు మిగిలిన టైం one hour. రెండవ పాటను compleet చేసారు . 

ఇక 10 నిముషాలు మిగిలి వున్నాయి దాటితే మరలా అమౌంట్ పే చెయ్యాలి. 

మూడవ పాట బ్యానర్ మీద శ్లోకం పెండింగ్ వుంది. 

నా వద్ద మని కూడా పెండింగ్ వుంది. ఆ టైంలో బాలు గారు వెళ్ళే హడావుడిలో మూడవ పాట స్క్రిప్ట్ అడుగు తున్నారు.

 అప్పుడు నేను వెళ్లి మనీ కొరవ పడ్డాయి .

రెండు పాటలకు మాత్రమె నా వద్ద మనీ వున్నాయి అని మనీ కవర్ చేతిలో పెట్టాను. 

అప్పుడు అతను చాలా సీరియస్ గా రాఘవులుగారితో చర్చించి అతను చేసిన సహాయమునకు నేను ఋణపడవున్నాను (అమ్మ రాజీనామా) పాటకు నా టైం ఇచ్చినందుకు అతను నాకు మనీ ఇవ్వనవసరం లేదు అని మూడవ పాటను పాడి నాకూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి వెళ్ళారు. 

మరి ఆసమయములో అతను చేసిన సహాయం నేను ఎలా మరచిపోగలను.

మీఆత్మకు శాంతి కలగాలని కోరుకోవటం తప్ప.

ఇట్లు మిమ్మల్ని మీ పాటలను మరచిపోలేని అప్పట్లో మీకు క్రొత్త నిర్మాతను.  ...Maddali Kesava Rao, Producer, Sri Sravani Art Movies, KOWRAVA SAMRAJYAM. Podili, Prakasam Dt.

Jai Vasavi Mata Jai

 

Thank you for reading and visiting!

Maddali Swetha, MBA (HR)


 maddali_swetha@yahoo.com

My Personal Blog (Maddali Swetha Blog) - http://maddaliswetha.blogspot.com/  - “IDEAS CAN BE LIFE CHANGING”


No comments:

Post a Comment